చిదంబరంతో... చిక్కులు


చిదంబరం కేంద్ర హోం మంత్రి. అంతేకాదు పార్టీ ప్రముఖులతో అంతర్గతం గా గొడవ లు పెట్టుకు నే గడ సరి. ప్రజా సమస్యలని ఏ ఒక్కరి మీదకో నెట్టి చూడటం భావ్యం కాదన్నా... ఆ ప్రజాసమస్యల్ని తీర్చటంలో ఆ ఒక్కరి బాధ్యత కూడా ఉంటుందనేది ఆయన గమనించాలి. 76 మంది పారామిలటరీ బలగాలు నక్సల్స్‌ మరణకాండకు హతులైతే.. చిదంబరం పంచట్టు ఏ మాత్రం చెరిగిపోలేదు. పైగా ఆయన పద్మ అవార్డు ఫంక్షన్‌లో చిరునవ్వులు చిందించారు. ఎక్కడో జరిగిన రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ.. రాజీనామా చేసిన రైల్వే మంత్రి ఉన్న దేశంలోనే.... ఎన్ని ప్రమాదాలు జరిగినా ఏమీ పట్టనట్లు ఉండే రాజులున్న లోకం ఇది.అంతర్గత తగాదాలు, వివాదాలు అధిష్టా నానికి తెలియకుండా జరిగేవి కావు. ప్రతి చిన్న విష యాన్ని ప్రెస్‌మీట్‌లో రాద్ధాంతం చేసి చివరికి... నాకిచ్చిన కర్తవ్యాన్ని శిరసావహిస్తాను. నా శక్తి సామర్థ్యాల మేరకు నేను పనిచేస్తాను. నాలానే వేరేవాళ్లు పనిచేస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంటుందని చిదంబరం గొప్పలు చెబుతారు. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌ సింగ్‌ విమర్శలకి ఏనాడు ఘాటుగా స్పందించని చిదంబరం ఆయన వైఖరిని మార్చుకోకపోగా... అన్నింటికి కాలమే పరిక్షారం చూపుతుం దంటూ... హుందాగా తెల్లపంచెలో ప్లాస్టిక్‌ నవ్వు లు చిందిస్తారు. దిగ్విజయ్‌ చిదంబరాన్ని విమ ర్శించిన దాంట్లో తప్పుఒప్పులు పక్కన పెడితే.. దేశశ్రేయస్సు కోసం ఓ హోంమంత్రి తీసుకోవా ల్సిన బాధ్యతను ఆయన సక్రమంగా చేయటం లేదనేది స్పష్టం.నేను అన్నమాటకు ఎప్పుడూ కట్టుబడే ఉంటాను. తీసుకోవటం.. తీసుకోక పోవటం అనేది హోంమంత్రికే వదిలేసాను నక్సల్స్‌ని ఉగ్రవాదుల్లా చూసి మట్టుపెట్టాలను కోవటం ఆయన తప్పు. వారి కార్యకలాపాలను నిరోధించి ప్రజలను రక్షించాల్సిన బాధ్యత ప్రభు త్వానికుండాలని దిగ్విజయ్‌ ఎన్నో సార్లు నెత్తి బాదుకున్నారు. నక్సల్స్‌ విరుచుకుపడిన తెల్లారే వాళ్లనీ తుదముట్టించటానికి హెలికాప్టర్లు, అత్యా దునిక యంత్రాగాన్ని ఉపయోగిస్తామన్న హోం మంత్రి... పాకిస్థాన్‌ విషయంలో తీసుకుంటున్న చర్యలు అంతంతమాత్రమే.
వ్యక్తిగత అభిప్రాయా ల కన్నా ఓ ఉద్దేశం కోసం చేసే పనిలో కలసికట్టు గా తీసుకునే నిర్ణయాలకు విలువుంటుంది. దాన్ని పక్కన పెట్టి సొంతదారిలో పయనిస్తే...చిక్కుల్లో పడేది దేశప్రజలే. పార్టీలో కొంతమంది చేసే కార్యకలాపాల వల్ల ప్రజల్లో నాయకుల పట్ల ఉన్న గౌరవం తుడిచిపెట్టుకు పోతుంది.మంత్రుల మధ్య గొడవలేమైనా ఉంటే వాటిని క్యాబినెట్‌ సమావేశంలో చర్చించుకుని పరిష్కరించుకోవాలి. అంతేకాని ఇలా ఎక్కడపడితే అక్కడ వాదులాడు కుంటే పార్టీని ఎవరూ అభిమానించరని ఆర్థికశాఖ మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ చాలా సందర్భాల్లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వివాదాలు లేని పార్టీ అంటూ ఉండదు. అయితే ప్రతిరోజు వివాదాలతో కాంగ్రెస్‌ పార్టీ చర్చకు వస్తున్నది. వ్యక్తిగత అభిప్రాయభే దాలను... ప్రజల సమక్షంలోనే కుండబద్ధలు కొట్టినట్లు చెప్పటంలో కాంగ్రెస్‌లోని కొంతమంది నాయకులు దిట్టలు. చిదంబరం జనాభా లెక్కలో కులప్రస్తావనకు వ్యతిరేకంగా ఉన్నారు.జనగణన కులగణన కాకూడదనేది ఈయనగారి అభిప్రాయం. అయితే హోంమంత్రి వ్యాఖ్యానంపై చాలామంది మం్ర తులు గుర్రుగా ఉన్నారు. మండల్‌ కమిషన్‌ సమ యంలో కాంగ్రెస్‌ దానికి పూర్తి విరుద్ధంగా ఉంది. మళ్లీ అదే తప్పు ఈ సారి జరగనివ్వమని చాలా మంది అంటున్నారు. జనాభాలెక్కల్లో కుల ప్రస్తావన విషయంలో ఈసారి అలా చేయ బోమని న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీ కూడా స్పష్టం చేశారు. తెలంగాణా విషయంలో చిదంబరం చేసిన ప్రకటన ఆ సమయానికి అగ్నిగుండంగా మారిన ప్రాంతాన్ని చల్లార్చినా.... కాలక్రమేణా తెలంగాణపై చిదంబరనొక్కులు నొక్కారు.జ్ఞానేశ్వర్‌ రైలు ప్రమాదంలోనూ చిదంబరం మమతాబెనర్జీల మధ్య వార్‌ నడిచింది. హార్వర్డ్‌లో మేనేజ్‌మెంట్‌ పాఠాలు చదువుకున్న చిదంబరం ప్రజా సమస్యలపై అవగా హనచేసుకున్నప్పడే ఆయన హోంమంత్రి పదవికి సార్థకత.

Source:Suryaa

www.123tollywoodcinemalu.blogspot.com is not responsible for the accuracy, compliance, copyright, legality,decency, or any other aspect of the content of other linked sites.Sometimes we post the links from other sites that are on the Internet.